బహ్రెయిన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి
- November 25, 2020
మనామా:ఆరు రోజుల విదేశీ పర్యటలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. మంత్రితో పాటు బహ్రెయిన్ చేరుకున్న పలువురు ఉన్నతాధికారులకు ఆ దేశ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ దివంగత ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ ఖలీఫా మృతికి భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. అలాగే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి చర్చించనున్నారు. బహ్రెయిన్ పర్యటన తర్వాత భారత విదేశాంగమంత్రి యూఏఈ చేరుకుంటారు. 26న యూఏఈ పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత27 నుంచి 28 వరకు సీషెల్స్ లో భారత విదేశాంగమంత్రి పర్యటిస్తారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







