అయోధ్య విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ పేరు
- November 25, 2020
లక్నో:అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ సిఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రివర్గం తీర్మానించింది. ఈ వినామాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడం పట్ల సాధువులు హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కొంత కాలంగా ఉంది. చివరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం గమనార్హం. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే సిఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, యూపీలో ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ కూడా యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







