ప్రజలందరూ నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి:సీపీ సజ్జనార్
- November 25, 2020
హైదరాబాద్:సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీలలో ని 674 పోలింగ్ లొకేషన్స్ లోని 2569 పోలింగ్ స్టేషన్లలో డిసెంబర్ 1న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లకు సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఈరోజు మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
రాజేంద్రనగర్, మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు సలహాలు ఇచ్చారు.రాజేంద్రనగర్ పద్మశాలిపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లక్ష్మీగుడా వాంబే ట్ కాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లక్ష్మిగుడా మండల పరిషత్తు పాఠశాల, నౌ నంబర్ సెట్విన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్, సిఖ్ చావని, రాంబాగ్ స్కౌట్స్ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ల ను సందర్శించి సూచనలు చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకూ ముందస్తు పటిష్ట భద్రతా చర్యల తీసుకుంటున్నామన్నారు.ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఇప్పటికే గుర్తించిన 243 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో/ సమస్యాత్మక ప్రాంతాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.ప్రతీ లొకేషన్ లో ఇద్దరు పోలింగ్ లొకేషన్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపించి నివేదించడంతో పాటు పోలింగ్ సరిగ్గా జరిగేలా సహకరిస్తారు.
పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తారన్నారు.
నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ మొత్తం ఎన్నికల ప్రక్రియలపై పటిష్ట నిఘా ఉంచనున్నామన్నారు.పోలింగ్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓటర్లు ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని సౌకర్యాలు సమకూర్చామన్నారు.
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.ఎన్నికల పటిష్ట నిర్వహణలో భాగంగా సైబరాబాద్ లోని 38 డివిజన్ లకు గాను దాదాపుగా 13,500 మంది (10,500 మంది సివిల్ పోలీసులు, 3000 మంది ఏఆర్) పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారన్నారు.
వీరితో పాటు పెద్ద ఎత్తున డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు ఎన్నికల విధులలో పాల్గొంటున్నారన్నారు.పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల వేళ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్,డీసీపీ శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, సీఎఆర్ ఏడీసీపీ మాణిక్ రాజ్, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ కుమార్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ సురేష్, మైలర్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







