కరోనా ఎఫెక్ట్: భారత్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 31 వరకు విమానాలు రద్దు
- November 26, 2020
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులను బట్టి విమానాలు నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురువారం వెల్లడించింది.
కాగా, కోవిడ్‌కు సంబంధించి ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్26న విడుదల చేసిన ఉత్తర్వులకు మార్పులు చేస్తున్నామని, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాల్లో కార్గో విమానాలకు ఈ నిబంధనలు విర్తించవు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు