28న హైదరాబాద్‌కు మోదీ
- November 26, 2020
హైదరాబాద్: ప్రధాని మోదీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఆయన పర్యటన ఖరారైంది. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్‌ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న 'కొవాగ్జిన్' టీకా పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే భాజపా జాతీయ నేతలు, పలువురు కేంద్రమంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. 27న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్, 28న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 29న కేంద్రహోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. వీరంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రానుండటం ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు