షార్జా: నేషనల్ డే సందర్భంగా ట్రాఫిక్ ఫైన్స్ బకాయిలపై 50% డిస్కౌంట్
- November 26, 2020
యూఏఈ 49వ జాతీయ దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ షార్జా అధికార యంత్రాంగం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 2 నుంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రారంభమై..49 రోజుల పాటు కొనసాగనుందని షార్జా అధికారులు తెలిపారు. అయితే..సీరియస్ ఉల్లంఘనలకు సంబంధించి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని కూడా స్పష్టం చేశారు. మిగిలిన అన్ని రకాల ట్రాఫిక్ వయోలేషన్స్ పై చలాన్లను సగం మాత్రం చెల్లిస్తే చాలని వివరించారు. అలాగే స్వాధీనం చేసుకున్న వాహనాలను విడిచిపెట్టడంతో పాటు బ్లాక్ పాయింట్స్ ను కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ట్రాఫిక్ చలాన్లపై రస్ అల్ ఖైమా, అజ్మన్ ఎమిరాతిలు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించగా..ఇప్పుడు తాజాగా షార్జా కూడా డిస్కౌంట్ జాబితాలో చేరింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు