రియాద్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద దొరికిన 369.8 గ్రాముల బంగారం
- November 26, 2020
హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇద్దరు ప్రయాణీకులపై గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరూ రియాద్ నుంచి జి8 7000 నెంబర్ విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వీరి వద్ద నుంచి మూడు గోల్డ్ బార్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్స్లో నిందితులు ఈ గోల్డ్ బార్స్ని వుంచి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్రయాణీకుడు 184.9 గ్రాముల బంగారాన్ని స్మగుల్ చేశాడు. ఇద్దరి నుంచి 369.8 గ్రాముల బంగారం అధికారులకు దొరికింది. ఈ బంగారం విలువ 18,07,950 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. కేసు విచారణ జరుగుతోంది.

తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్పాస్లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







