అబుధాబి: నిర్మాణ దశలోనే BAPS హిందూ మందిర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

- November 27, 2020 , by Maagulf
అబుధాబి: నిర్మాణ దశలోనే BAPS హిందూ మందిర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

అబుధాబి:అబుధాబిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తొలి హిందూ దేవాలయం బాప్స్ హిందూ మందిర్...నిర్మాణ దశలోనే తన ప్రఖ్యాతను చాటుకుంటోంది. నవంబర్ 25, 2020న జరిగిన కమర్షియల్ ఇంటీరియర్ డిజైన్ అవార్డులలో బాప్స్ హిందూ మందిర్, ఆర్‌ఎస్‌పికి ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం వందల ఎంట్రీలు రాగా..జడ్జీలు వాటిలో 15 ఎంట్రీలను ఫైనల్ కు ఎంపిక చేశారు. చివరకు బాప్స్ హిందూ మందిర్ డిజైన్ కు ఫిదా అయిపోయారు. భారత పురణాలు, సంస్కృతి...గల్ఫ్ నిర్మాణ శైలి సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఆలయం డిజైన్ ప్రశంసలు కురిపంచిన న్యాయనిర్ణేతలు..ఆలయం పూర్తి కాకున్నా..మందిర పనుల్లో విశిష్టంగా చెబుతున్న ప్రకారాలు, రాతి నిర్మాణానికి సంబంధించి ఇటాలియన్ మార్బుల్, రాజస్థాని ఇసుకరాతితో చెక్కిన శిల్ప సౌందర్యాలను ప్రశంసించారు. 

బాప్స్ మందిరానికి మరో అవార్డు రావటం పట్ల ప్రాజెక్ట్ క్రియేటివ్ డైరెక్టర్ మైఖేల్ మెక్ గిల్, ప్రాజెక్ట్ డిజైనర్ ఆంథోనీ టేలర్ హర్షం వ్యక్తం చేశారు. ఆధునికత, సాంప్రదాయ శైలితో శ్రావ్యంగా తీర్చిదిద్దుతున్న ప్రాజెక్టును నిపుణుల బృందం గుర్తించి అవార్డుతో సత్కరించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బాప్స్ లోని స్వామీజీలు తమ అద్భుత ఆలోచనలు మరింత గొప్పగా విశదీకరించగలిగారని కొనియాడారు. మరోవైపు ఆలయ డిజైన్ కు అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన బాప్స్  హిందూ మందిర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జస్బీర్ సింగ్ సాహ్నీ...ప్రాజెక్టు కల సాకారం దిశగా అడుగులు పడటంలో సహకరించిన వాలంటీర్లకు, నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ డిజైన్ ను అద్భుతంగా మలచటంలో ఆర్ఎస్పీ అద్భుతంగా కృష్టి చేసిందని ప్రశంసించారు. ఇదిలాఉంటే బాప్స్ హిందూ మందిర్ కు ఇది రెండో అవార్డు కావటం విశేషం. గతంలో బెస్ట్ మెకానికల్ డిజైన్ అవార్డు కూడా దక్కింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com