ఇండియాలో వీసా సెంటర్స్‌ని పునఃప్రారంభించనున్న ఖతార్‌

ఇండియాలో వీసా సెంటర్స్‌ని పునఃప్రారంభించనున్న ఖతార్‌

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఖతార్‌ వీసా కేంద్రాల్ని ఇండియాలో త్వరలో ప్రారంభించనుంది. డిసెంబర్‌ మొదటి వారం నుంచి ఇవి తిరిగి తెరచుకుంటాయని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించింది. ట్విట్టర్‌ ద్వారా ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. డిసెంబర్‌ 3న ఖతార్‌ వీసా సెంటర్‌ తెరచుకోనుందని, అదే రోజు అపాయింట్‌మెంట్స్‌ కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతాయని మినిస్ట్రీ పేర్కొంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌, చెన్నై మరియు కోచీ నగరాల్లో ఖతార్‌ వీసా కేంద్రాలున్నాయి.  

Back to Top