ట్రాకింగ్ బ్రాస్లెట్ తొలగించిన ఒమనీ..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిందుకు జరిమానా, జైలుశిక్ష

ట్రాకింగ్ బ్రాస్లెట్ తొలగించిన ఒమనీ..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిందుకు జరిమానా, జైలుశిక్ష

కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణలో భాగమైన క్వారంటైన్ రూల్స్ ను బ్రేక్ చేసిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష పడింది. అలాగే వెయ్యి ఒమనీ రియాల్స్ ఫైన్ పడింది.  ఒమన్ లోని అల్ బాటిన సౌత్ గవర్నరేట్ లోని కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఒమన్ కు చెందిన నిందితుడు డొమస్టిక్ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించటంతో పాటు చేతికి వేసిన ట్రాకింగ్ బ్రాస్లెట్ ను కూడా తొలగించాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు నిబంధనల అమలు విషయంలో కఠినంగా ఉంటామని ఒమన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని గతంలోనే సూచించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకుండా దుస్సాహాసానికి పాల్పడితే తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్షతో పాటు మీడియాలో వారి ఫోటో ప్రచురించి నేమ్ షేమ్ చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా..ఓ ఒమనీ మాత్రం అధికారుల హెచ్చరికలను ఖాతారు చేయలేదు. డొమస్టిక్ క్వారంటైన్ ఉండాల్సిన వ్యక్తి రూల్స్ బ్రేక్ చేశాడు. పైగా ట్రాకింగ్ బ్రాస్లెట్ ను తీసిపారేశాడు. అధికారులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు...ఎలాంటి సంజాయిషీ లేకుండా నిందితుడ్ని 20 రోజుల పాటు జైలులో పెట్టాలని తీర్పునిచ్చింది. వెయ్యి రియాల్స్ జరిమానాతో పాటు సమాజానికి ముప్పు కలిగించేలా వ్యవహరించిన అతని ఫోటోను మీడియాలో ప్రచురించాలని ఆదేశించింది. 

 

Back to Top