హీరో విశాల్, ఆర్యల భారీ మల్టీస్టారర్ `ఎనిమీ`
- November 27, 2020 (1)_1606498723.jpg)
ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి మరో భారీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి `ఎనిమీ` అనే పేరును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇది యాక్షన్ హీరో విశాల్ కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమాలో హీరోయిన్గా నటించిన మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది చిత్రయూనిట్.
యాక్షన్ హీరో విశాల్, ఆర్య, మృణాళిని రవి, ప్రకాశరాజ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి. ఆర్ డి రాజశేఖర్, సంగీతం: తమన్ ఎస్ ఎస్, ఆర్ట్: టి. రామలింగం, ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్ రవివర్మ, నిర్మాత: వినోద్ కుమార్, దర్శకత్వం: ఆనంద్ శంకర్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు