అహ్మదాబాద్ లో వ్యాక్సిన్ ల్యాబ్‌ను పరిశీలించిన ప్రధాని
- November 28, 2020
అహ్మదాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధాని మోడి అహ్మదాబాద్ చేరుకుని, అక్కడి నుంచి జైడస్ క్యాడిలా పార్కుకు చేరుకున్నారు. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘జైకోవ్‌డి’ టీకా ప్రయోగాలను మోడి పరిశీలించారు. ఆ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పీపీఈ కిట్ ధరించి అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్‌లను పరిశీలించారు. అలాగే, ఆ సంస్థ ప్రమోటర్లతో పాటు ఎగ్జిక్యూటివ్‌లతో మోడి మాట్లాడారు. మోడిని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్క్ వద్దకు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో వారికి మోడి అభివాదం చేశారు. అహ్మదాబాద్ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







