ఒమన్ - ఇండియా మధ్య పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
- November 28, 2020
మస్కట్:విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌పై ఎయిర్ బబుల్ ఒప్పందానికి సంబంధించి నిషేధం డిసెంబర్ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇండియాకి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకు టిక్కెట్ ధరలు భారంగా మారాయి. అక్టోబర్‌లో 50 ఒమన్ రియాల్స్ వున్న టిక్కెట్ ధర ఇప్పుడు 135 ఒమన్ రియాల్స్ వరకు పెరిగింది. మస్కట్ - కాలికట్ మధ్య ఈ ధరలున్నాయి. కాగా, మస్కట్ - ముంబై మధ్య టిక్కెట్ ధర 171 ఒమన్ రియాల్స్‌కి చేరుకుంది. గతంలో ఈ ధర 80 ఒమన్ రియాల్స్‌గా వుండేది. కరోనా నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఒప్పందాలకు సంబంధించి ప్రైవేటు విమానయాన సంస్థలపై నిషేధం విధించారు. తద్వారా ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







