వచ్చే ఏడాది కువైట్‌ని వీడనున్న 70,000 మంది వలసదారులు
- November 28, 2020
కువైట్ సిటీ:70,000 మందికి పైగా వలసదారులు వచ్చేఏడాది కువైట్‌ని వీడనున్నారు. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీని రెన్యువల్ చేయడానికి కువైట్ అథారిటీస్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోకి వచ్చేవారంతా దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. జనవరి 1 నుంచి రెన్యువల్ గడువు ముగుస్తుంది గనుక, అప్పటి నుంచే ఆ కేటగిరీలోకి వచ్చేవారు దేశం విడిచి వెళ్ళక తప్పదు. సుమారుగా 70 వేల మంది ఈ కేటగిరీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, తమ పిల్లలు కువైట్‌లో పనిచేస్తూ వుంటే, ఫ్యామిలీ వీసా కింద ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని మార్చుకుని, కువైట్‌లో వుండడానికి అవకాశం వుంటుంది. అయినాగానీ, 70 వేల మంది దేశం విడిచి వెళ్ళక తప్పకపోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







