ఓవర్ నైట్ బీచ్ క్యాంపులు, కారవాన్ నివాసాలపై నిషేధం
- November 28, 2020
షార్జా:రాత్రి వేళల్లో బీచ్ క్యాంపులు, కారవాన్లలో నివాసం వుండడం వంటివాటిపై షార్జాలో నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఎమర్జన్సీ మరియు క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో వుంటాయి. కరోనా లాక్డౌన్ తర్వాత, నిబంధనల నుంచి వెసులుబాటు కల్పిస్తూ, బీచ్‌లకు వెళ్ళేవారికీ, ఇతర కార్యక్రమాలకూ అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే, మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాత్రి వేళల్లో కుటుంబ సమేతంగా కారవాన్లలో స్టే చేసేవారు, బీచ్‌లలో క్యాంపులు ఏర్పాటు చేసుకునేవారికి కొంత నిరాశ కలిగించేలా ఈ తాజా నిర్ణయం అమల్లోకి వచ్చింది. వింటర్ సీజన్లో కరోనా ఉధృతి పెరిగే అవకాశం వున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. కాగా, నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







