ఎంబీఆర్ సోలార్ పార్క్ తో దుబాయ్ లోని 3 లక్షల ఇళ్లకు కరెంట్ సప్లై

- November 28, 2020 , by Maagulf
ఎంబీఆర్ సోలార్ పార్క్ తో దుబాయ్ లోని 3 లక్షల ఇళ్లకు కరెంట్ సప్లై

దుబాయ్ లో చేపట్టిన మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోలార్ పార్క్ లో నాలుగో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫోర్త్ ఫేజ్ పూర్తి అయితే..ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ స్టోరేజ్ దుబాయ్ కి అందుబాటులోకి రానుంది. దాదాపు 15 గంటల పవర్ ను స్టోర్ చేసుకొని...రోజంతా విద్యుత్ సప్లై చేసేందుకు అవకాశం ఉంటుందని దుబాయ్ విద్యుత్, నీటి సరఫరా అధికార విభాగం దివా వెల్లడించింది. అంతేకాదు నాలుగో దశ ప్రాజెక్టు పనుల ద్వారా దుబాయ్ లోని దాదాపు 3,20,000 నివాసాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ద్వారా కార్బన్ ఉద్గారాలను ఏడాదిలో 1.6 మిలియన్ టన్నుల వరకు తగ్గించవచ్చని వెల్లడించింది. స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి మోడల్ బేస్ గా 950 మెగావాట్ల సామర్ధ్యంతో కొనసాగుతున్న ఫోర్త్ ఫేజ్ ప్రాజెక్ట్ ప్రపంచంలో అత్యంత భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టులలో ఒకటి. కాన్సెంట్రేటెడ్ సోలార్ పవర్, ఫోటోవాల్వోటెక్ సోలార్ పవర్ కు కలిపి 15.78 బిలియన్ దిర్హామ్ లను ఇన్వెస్ట్ చేసినట్లు దివా వెల్లడించింది. ఇన్ని ప్రత్యేకలు ఉన్న ఎంబీఆర్ సోలార్ పార్క్ ప్రపంచంలోని పలు రికార్డులను తిరగరాసింది. 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రంగా..అతి చౌకగా విద్యుత్ ను అందిస్తున్న ప్రాజెక్టుగా...262.22 మీటర్లతో ప్రపంచంలోనే అతి పొడవైన సోలార్ పవర్ టవర్ ఇలా అన్ని రికార్డులను దక్కించుకుంది. 2030 నాటికి ఇక్కడి సోలార్ పార్క్ ప్రాజెక్ట్ సామార్ధ్యాన్ని 5 వేల మెగావాట్లకు పెంచేలా ప్లాన్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com