మూడో త్రైమాసికంలో ఎంసీఐఐపీ దగ్గర 4700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు
- November 28, 2020
ఒమన్: ఒమన్ లో రెండో త్రైమాసికంతో పోలిస్తే...మూడో త్రైమాసికంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుదల కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో ఇప్పటివరకు 4,700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం...రెడ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లు అన్ని కలుపుకొని 2606 సింగిల్ ట్రేడర్ కేటగిరి, 595 పరిమితికి లోబడిన కంపెనీలు, ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న 498 కంపెనీలు రిజిస్ట్రేషన్ కు వచ్చాయి. ఇక కుటీర పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించి 355, ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు 319, లాభార్జన ఆశించిన సంస్థలు 224, సోలిడటరీ కంపెనీలు 93, వీధి వ్యాపారాలు 54, లిమిటెడ్ కంపెనీలు 47 చొప్పున రిజిస్టర్ అయినట్లు ఎంసీఐఐసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్‌లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







