క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న హీరో సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల
- November 28, 2020
హైదరాబాద్:సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ . ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేషన్‌తో డిసెంబర్లో విడుదల చేస్తున్నారు. నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సందర్భంగా..
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి మేం సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా క్రిస్మస్కు మిమ్మల్ని నవ్వించడానికి. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు.
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు