ఇరాన్ ప్రముఖ అణు శాస్త్రవేత్త దారుణ హత్య
- November 29, 2020
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ట్రెహాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే దారుణ హత్యకు గురయ్యారు. నగర శివారు ప్రాంతమైన అబ్‌సార్డ్ వద్ద వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అణుశాస్త్రవేత్త హాస్పిటల్‌లో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. అణు శాస్త్రవేత్త హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్తలను వరుసగా గత పదేళ్ల నుంచి హతమారుస్తున్నట్లు ఇజ్రాయిల్‌పై ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







