63 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- November 29, 2020
కువైట్ సిటీ:కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం తమ అగ్ని మాపక సిబ్బంది, భారీ వర్షాల నేపథ్యంలో వరలో చిక్కుకుపోయిన 63 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని డైరెక్టరేట్ పేర్కొంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనాస్ అల్ సలెహ్, ఆపరేషన్స్ రూమ్ని సందర్శించగా, ఫైర్ బ్రిగేడ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలెద్ అల్ మెక్వాద్ ఆయా అంశాల గురించి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, చెరువులు, నీటి ప్రవాహాలు వున్న ప్రాంతాల వైపు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 112 నెంబర్కి ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష