ఫేక్ ఐపీ అడ్రస్ వినియోగిస్తే 2 మిలియన్ దిర్హాముల జరీమానా
- November 29, 2020
దుబాయ్:ఫేక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ని వినియోగించి నేరాలకు పాల్పడితే, అలాంటివాసరరియకి 500,000 దిర్హాముల నుంచి 2 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు. అలాగే జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరోమారు స్పష్టం చేసింది. ఐపీ అడ్రస్ అనేది కంప్యూటర్ నెట్వర్క్లో కమ్యూనికేషన్ కోసం ఆయా డివైజ్లకు ఏర్పాటు చేయబడుతుందనీ, ఫెడరల్ చట్టం 5 - 2012, ఆర్టికల్ 9 ప్రకారం, సైబర్ క్రైమ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనీ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో 500,000 దిర్హాములకు తగ్గకుండా 2 మిలియన్ దిర్హాములకు మించకుండా జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా పడే అవకాశం వుంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా థర్డ్ పార్టీ ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసుకుంటే అది నేరం కింద పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







