సూట్‌కేసులో మహిళ మృతదేహం

- November 29, 2020 , by Maagulf
సూట్‌కేసులో మహిళ మృతదేహం

మక్కా:పవిత్ర మక్కాలో ఓ యువతి మృతదేహం లభ్యమయ్యింది. నాలుగవ రింగ్‌ రోడ్డు సమీపంలో ఓ అనుమానాస్పద సూట్‌ కేసులో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలి వయసు 24 సంవత్సరాలు వుంటుందనీ, ఆమె ఇండోనేసియా జాతీయురాలనీ అధికారులు తెలిపారు. పని నుంచి ఆమె గైర్హాజరయినట్లుగా స్పాన్సర్‌ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ హత్య కేసుని ఛేదించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఓ పౌరుడు, పెద్ద సూట్‌కేసుని అనుమానాస్పద స్థితిలో వుండగా కనుగొని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com