కోవిడ్ 19 కారణంగా ఆలస్యం కానున్న కొత్త విమానాశ్రయ ప్రారంభోత్సవం
- November 29, 2020
మనామా:ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభం ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్న విషయం తెలిసిందే. కాగా, కరోనా ప్రభావంతో బహ్రెయిన్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఎనిమిది నెలలుగా వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ కమల్ అహ్మద్ వెల్లడించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, అధికారిక ప్రారంభోత్సవానికి సిద్దంగా వుందనీ, మార్చి నెలలోనే ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సి వుందని అన్నారాయన. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామనీ, పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రారంభోత్సవం చేస్తామని ఆయన తెలిపారు. 210,000 చదరపు మీటర్ల వైశాల్యంలో 1.1 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఏడాదికి 14 లక్షల మంది ప్రయాణీకులకు సేవలందించేలా ఈ ఎయిర్‌పోర్ట్‌ని నిర్మించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష