యూఏఈ: అక్మస్మాత్తుగా లేన్లు మార్చితే Dh1000 ఫైన్...4 బ్లాక్ పాయింట్స్
- November 30, 2020
యూఏఈ:రోడ్లపై అకస్మాత్తుగా టర్నింగ్ తీసుకునే వాహనదారులపై మరింత నిఘా పెంచనున్నట్లు షార్జా పోలీస్ విభాగంలోని ట్రాఫిక్, పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇందుకోసం 'రషీద్' స్పీడ్ రాడర్స్ కు మరింత అధునాతనను జోడిస్తూ అప్ గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. సడెన్ ఒక లేన్ నుంచి మరో లేన్ కు వాహనాలను మళ్లీంచటం..అకస్మాత్తుగా టర్న్ చేయటం ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోందన్నారు. హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో సడెన్ టర్నింగ్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రతీ వాహనదారుడు తమ వాహనాన్ని మళ్లించే ముందు...అవతలి లేన్లో ఇతర వాహనాలు వస్తున్నాయో లేదో ఓ సారి చెక్ చేసుకోవాలని, లేన్ మార్చే సమయంలో విధిగా ఇండికేటర్ వేయాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా హైవేలపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలను పాటించకుండా ప్రమాదాలకు కారణమయ్యేలా నిబంధనలు ఉల్లంఘించే వారిని స్పీడ్ రాడార్స్ ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సడెన్ టర్న్ తీసుకునే వారికి Dh 1000 ఫైన్ తో పాటు 4 బ్లాక్ పాయింట్లు ఇస్తామని పోలీసులు హెచ్చరించారు. ా
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..