పర్యాటక వీసాల జారీకి ఒమన్ సుప్రీమ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- November 30, 2020
మస్కట్:దేశంలో పర్యాటక రంగానికి మద్దతుగా ఒమన్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోకి పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించేందుకు కమిటీ అంగీకరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీమ్ కమిటీ...దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించి విజిట్ వీసాల జారీకి సమ్మతి తెలిపింది. దీంతో సుల్తానేట్ పరిధిలో ఎక్కడికైనా పర్యాటకులకు పర్మిషన్ లభించనుంది. అయితే...పర్యాటక రంగంలోని హోటళ్లు, టూరిజం కంపెనీల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉండాలని ఉండాలని సూచించింది. ఇదిలాఉంటే..కార్మికుల కొరత, ఉద్యోగుల సంఖ్య కుదింపు వంటి చర్యల కారణంగా అవరోధాలు ఎదుర్కుంటున్న పనులను నిలిపివేయాలని కూడా కమిటీ నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..