కోవిడ్ ఎఫెక్ట్:లోన్ల చెల్లింపులలో ఊరట..
- November 30, 2020
కువైట్ సిటీ:చిన్న వ్యాపారుస్తులపై కరోనా సంక్షోభ ప్రభావం పడకుండా..లోన్ వాయిదాల చెల్లింపులలో వెసులుబాటు సౌకర్యాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు పొడిగించింది సౌదీ సెంట్రల్ బ్యాంక్. దీంతో రుణాల చెల్లింపులలో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న చిన్న వ్యాపారస్తులు...తమ వాయిదాల చెల్లింపులను కొద్దికాలం ఆలస్యంగా చెల్లించేందుకు ఆస్కారం ఏర్పడుంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 77 బిలియన్ రియాల్స్ లోన్లపై ప్రభావం చూపనుందని అంచనా వేసింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. మహమ్మారి ప్రభావం దేశ ఆర్ధిక లోటుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు తొలిగా స్పందించిన సెంట్రల్ బ్యాంక్...గత మార్చిలోనే ఉద్దీపన చర్యలను ప్రారంభించింది. చిన్న వ్యాపారులపై ప్రభావం పడకుండా...లోన్ల వాయిదాల షెడ్యూల్ ను వ్యాపారులకు అనుకూలంగా సవరించింది. ఆ తర్వాత అవసరం మేరకు మరోసారి పొడగిస్తూ వస్తోంది. ఈ డిసెంబర్ పొడిగించిన గడువు ముగిసిపోనుంది. అయితే..ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి వాయిదా చెల్లింపు వెసులుబాటు మరికొంత కాలం అవసరమని భావించటంతో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ వెసులుబాటు సౌకర్యాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!







