శివసేనలోకి చేరిన 'రంగీలా' నటి
- December 01, 2020
ముంబయి: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ మంగళవారం శివసేనలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి పరాజయం చెందిన 46 ఏళ్ల ఊర్మిళ గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఆయన సమక్షంలో ఆమె శివసేనలో చేరారు.
కాగా..గవర్నర్ కోటాలో ఊర్మిళ పేరును శాసన మండలి సభ్యత్వానికి ఇటీవలనే గవర్నర్ బిఎస్ కోష్యారీకి శివసేన సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఉత్తర ముంబయి లోక్‌సభ స్థానంలో పోటీ చేసి బిజెపి అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఓడిపోయిన ఊర్మిళ ఇటీవల ముంబయిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరుతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం