రైతులతో కేంద్రం చర్చలు ముగిసాయి
- December 01, 2020
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు మధ్యాహ్నం 35 రైతు సంఘాల నాయుకులతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. పంజాబ్‌కు చెందిన రైతులతో మంత్రి భేటీ అవుతున్నారు. యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ రైతు నేతలతోనూ మంత్రి ఈ సాయంత్రం భేటీ అయ్యారు.మళ్ళీ 3వ తేదీ సమావేశం కానున్నారు
కొత్త వ్యవసాయ చట్టాలపై తుది నిర్ణయం తీసుకోవాలని బీకేయూ అధ్యక్షుడు నరేశ్ టికాయిట్ తెలిపారు. అయితే రైతు నేతలతో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు. కేంద్ర, రైతు నేతల మధ్య సరైన రీతిలో చర్చలు జరగాలని ఢిల్లీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు. రైతులు ప్రతిపాదించిన అన్ని డిమాండ్లను కేంద్రం అంగీకరించాలన్నారు. బురారీలో ఆందోళన చేపడుతున్న రైతులను గెహ్లాట్ కలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం