రైతులతో కేంద్రం చర్చలు ముగిసాయి

- December 01, 2020 , by Maagulf
రైతులతో కేంద్రం చర్చలు ముగిసాయి

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులతో కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఈరోజు మధ్యాహ్నం 35 రైతు సంఘాల నాయుకులతో స‌మావేశం అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కూడా పాల్గొన్నారు. పంజాబ్‌కు చెందిన రైతుల‌తో మంత్రి భేటీ అవుతున్నారు. యూపీ, ఉత్త‌రాఖండ్‌, హ‌ర్యానా, ఢిల్లీ రైతు నేత‌ల‌తోనూ మంత్రి ఈ సాయంత్రం భేటీ అయ్యారు.మళ్ళీ 3వ తేదీ సమావేశం కానున్నారు 

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని బీకేయూ అధ్య‌క్షుడు న‌రేశ్ టికాయిట్ తెలిపారు. అయితే రైతు నేత‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాత‌నే తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేంద్ర మంత్రి తోమ‌ర్ వెల్ల‌డించారు. కేంద్ర‌, రైతు నేత‌ల మ‌ధ్య స‌రైన రీతిలో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ఢిల్లీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు. రైతులు ప్ర‌తిపాదించిన అన్ని డిమాండ్ల‌ను కేంద్రం అంగీక‌రించాల‌న్నారు. బురారీలో ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల‌ను గెహ్లాట్ క‌లుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com