భారత్‌లో కొత్తగా 36,604 కరోనా కేసులు
- December 02, 2020
న్యూఢిల్లీ: భారత్‌లో కొత్త కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,604 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,99,414కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,062 మంది కోలుకున్నారు.
గడచిన 24 గంటల సమయంలో 501 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,122కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,32,647 మంది కోలుకున్నారు. 4,28,644 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,24,45,949 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,96,651 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







