తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..
- December 02, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. గత 24గంటల్లో ఒకరు మాత్రమే కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. ఇక, కరోనా వైరస్ నుంచి నిన్న 925 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,51,620కి చేరింది.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







