ప్రయాణ ఆంక్షల్ని త్వరలో ఎత్తివేయనున్న సౌదీ అరేబియా

- December 02, 2020 , by Maagulf
ప్రయాణ ఆంక్షల్ని త్వరలో ఎత్తివేయనున్న సౌదీ అరేబియా

సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ప్రయాణ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన తేదీని త్వరలో వెల్లడిస్తారు. 2021 జనవరి 1 నుంచి నిషేధాజ్ఞల్ని ఎత్తివేసే అవకాశం వుందంటూ సెప్టెంబర్‌ 13న మినిస్ట్రీ ఓ ప్రకటన చేసిన విషయం విదితమే. 30 రోజుల ముందుగా ఈ విషయాన్ని ప్రకటిస్తామని మినిస్ట్రీ పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం ఏదీ వెలువడలేదు. అంతర్జాతీయ స్థాయిలో కరోనా పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నామనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com