డిసెంబర్‌ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన

- December 02, 2020 , by Maagulf
డిసెంబర్‌ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన

కువైట్‌ సిటీ: నేషనల్‌ అసెంబ్లీ (పార్లమెంటరీ) ఎన్నికలు ప్రారంభం కానున్న దరిమిలా, కువైట్‌ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాల్ని ప్రకటించింది. పౌరులంతా మాస్క్‌లను, గ్లవ్స్‌ని ధరించాల్సి వుంటుంది. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలి. పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్ళేముందు ఉష్ణోగ్రతల్ని పరీక్షించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తమ ఎలక్టోరల్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి వుంటుంది. పోలింగ్‌ స్టేషన్‌ వివరాల్ని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి గవర్నరేట్‌లోనూ ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరోనా సోకినవారి కోసం వినియోగిస్తారు. డిసెంబర్‌ 5న ఎన్నిక జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com