హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘స్వర్ణిమ్ సేవ’ను ప్రారంభించిన CISF

- December 03, 2020 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘స్వర్ణిమ్ సేవ’ను ప్రారంభించిన CISF

హైదరాబాద్: ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిసి “స్వర్ణిమ్ సేవ” పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని AMF ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ముఖ్య అతిథి ఆదిత్య మెహతా, ప్రత్యేక అతిథి ప్రదీప్ పణికర్, సీఈఓ, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL), ఎంకే సింగ్, డిఐజి & చీఫ్ విమానాశ్రయ భద్రతా అధికారి (CASO), CISF యూనిట్, RGIA; మిస్టర్ భరత్ కామ్‌దార్, హెడ్, సెక్యూరిటీ & విజిలెన్స్, GHIAL మరియు CISF, GHIALకు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు.

విమానాశ్రయంలో సహాయం అవసరమైన ప్రయాణికులకు ప్రత్యేక సేవలను అందించే లక్ష్యంతో CISF స్వర్ణిమ్ సేవను ప్రారంభించింది. ప్రయాణీకులకు సహాయం అందించడానికి, విమానాశ్రయంలో CISF ఒక ప్రత్యేక స్వర్ణిమ్ సేవ బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు సహాయం అవసరమైన ప్రయాణీకులకు అన్ని వేళలా సహాయం చేస్తారు.

ఈ సర్వీస్ PRM (ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రయాణీకులు) ప్రయాణీకులకు, ఒంటరిగా ప్రయాణించే సీనియర్ సిటిజన్స్, గర్భిణీ స్త్రీలు, శిశువులతో ప్రయాణిస్తున్న మహిళలు, మొదటిసారి ప్రయాణిస్తున్న వారు,  ఒంటరిగా ప్రయాణిస్తున్న పిల్లలు మరియు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న ఇతర ప్రయాణీకులకు సహాయం అందిస్తుంది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అన్ని ప్యాసింజర్ టచ్ పాయింట్ల వద్దా (డిపార్చర్ గేట్లు, లగేజ్ చెక్-ఇన్ & సెక్యూరిటీ పాయింట్లు తదితర) CISF స్వర్ణిమ్ సేవ సిబ్బంది సమస్యలు ఎదుర్కొనే ప్రయాణీకులకు సహాయం అందిస్తారు.

దేశీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తరువాత, జిఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2020 నవంబర్‌లో ప్రతిరోజూ 30,000 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయాణించారు. ఇది లాక్ డౌన్  తర్వాత కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన నాటి కంటే 10 రెట్లు ఎక్కువ.

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com