యూఏఈ వీసా ఉల్లంఘనలు డిసెంబర్‌ 31లోపు వెళ్ళిపోవాలి

యూఏఈ వీసా ఉల్లంఘనలు డిసెంబర్‌ 31లోపు వెళ్ళిపోవాలి

వీసా ఉల్లంఘనలకు సంబంధించి గ్రేస్‌ పీరియడ్‌ విషయమై ఫెడరల్‌ అథారిటీ ఆఫ్‌ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్‌ ప్రొసిడ్యూర్స్‌ వెల్లడించారు. అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. మార్చి 1కి ముందు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్‌ 31 వరకు దేశం విడిచి వెళ్ళేందుకు వారికి అవకాశం ఇస్తున్నారు. ఉల్లంఘనులు డిసెంబర్‌ 31 లోపు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సూచించారు. అబుదాబీ, షార్జా మరియు రస్‌ అల్‌ ఖైమా విమానాశ్రయాల నుంచి వెళ్ళాలనుకునేవారు ఆరు గంటల ముందుగా చేరుకోవాల్సి వుంటుంది. దుబాయ్‌, అల్‌ మక్తౌమ్‌ విమానాశ్రయాల ద్వారా వెళ్ళేవారు 48 గంటల ముందుగా దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ సెంటర్‌కి సమాచారం ఇవ్వాలి.  

Back to Top