దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

- December 03, 2020 , by Maagulf
దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్:ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ని కలిసిన వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగులు.దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత గారిని హైదరాబాద్ లోని నివాసంలో కలిసారు. దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ గారికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.3,016ల పెన్షన్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు కేవలం రూ.500 పెన్షన్ ఇచ్చేవారన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.1500, రెండోసారి రూ.3016 కు పెంచామన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 4,98,565 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. దివ్యాంగులు‌ పలు వినతులు అందించగా, వాటన్నింటినీ సీఎం కేసీఆర్ గారు, మంత్రి ‌కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. అంతేకాదు దివ్యాంగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు ‌కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఎమ్మెల్సీ కవిత, దివ్యాంగులకు భరోసానిచ్చారు.

గత ఆరేండ్లుగా వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మూడు చక్రాల మోటరు వాహనాలు, ట్రై సైకిళ్లు, క్యాలిపెర్స్‌, వీల్‌చైర్స్‌తో పాటు, దివ్యాంగులకు ఉపయోగపడే అనేక పరికరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ గారు దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే ఒక రోల్‌మోడల్‌గా ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ఏడాది డిసెంబర్‌ 3న రాష్ట్రపతి అవార్డు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీ ఎం.పి. బోర్లకుంట వెంకటేష్ నేతకాని, 21 సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత గారిని కలిసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com