దాత్రు హృదయాన్ని చాటుకున్న యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి

దాత్రు హృదయాన్ని చాటుకున్న యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి

తిరుపతి:తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు “బురేవి తుఫాను” దృష్ట్యా చంద్రగిరి మండలంలో లోతట్టు ప్రాంతాలైన పేరూరు చెరువులో ఇండ్లు కాలనీ నందు వరద దాటికి గృహాలు నీట మునిగిన కారణంగా అక్కడ నివాసముండు ప్రజలను అప్రమత్తం చేసి, అక్కడున్న వారిని ప్రభుత్వo ఏర్పాటు చేసిన పుణరావాస కేంద్రం నందు చేర్పించడం జరిగింది. 

అలాగే నడవలేని స్థితిలో ఉన్న ఒక అంగవైకల్య వృద్దుడిని యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి  స్వయంగా తన చేతుల మీదుగా ఆ వృద్దుడిని సురక్షితంగా తీసుకొని వచ్చి పుణరావాస కేంద్రంలో చేర్పించడంతో పాటు కేంద్రంలో ఆశ్రమం పొందు చెరువులో ఇండ్లు కాలనీ వాసులకు ఒక్కొక్క కుటుంబానికి 25kg ల బియ్యం, బెడ్ షీట్లు, రూ. 500/- నగదును ఇచ్చి తన దాత్రు హృదయాన్ని చాటుకున్నారు.

జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి సరైన సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి నిత్యవసర వస్తువులు ఇచ్చి తన సేవా హృదయాన్ని చాటుకున్న యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Back to Top