ఇండియన్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్ (ఐపీఎన్)ని ప్రారంభించిన ఎంబసీ
December 04, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో భారత ఎంబసీ, 'ఇండియన్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్' (ఐపీఎన్)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్‌లో భారత ప్రొఫెషనల్స్ మరియు ఎక్స్‌పర్ట్‌లకు ఇది చక్కని వేదిక అని ఎంబసీ పేర్కొంది. ఆయా విభాగాల్లో నైపుణ్యం, విజ్ఞానం కలిగి వున్న ఒపఫెషనల్స్ ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఎంబసీ కోరింది. భారతదేశం అత్యాధునిక ప్రగతిని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్రా కీలకమని, ఈ విభాగంలో అందరూ కలిసి పనిచేయాలని ఎంబసీ సూచించింది. సైంటిస్టులు, అకడమికియన్స్, ప్రొఫెసర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్, ఎకనమిస్ట్‌లు, స్కాలర్స్ తదితరులు ఈ వేదికను పంచుకోవచ్చు. ఈ లింక్ (https://forms.gle/pgPXsvFeCBiwvGsr9) ద్వారా ఆయా విభాగాలకు చెందినవారు రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంది. ట్విట్టర్ హ్యాండిల్‌ని కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం com1.kuwait@mea.gov.in. మెయిల్ చేయవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)