కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత--సీపీ సజ్జనార్
- December 04, 2020
హైదరాబాద్:సైబరాబాద్ పరిధిలోని జీహెచ్ఎమ్ సీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్న 10 డీఆర్సీ/ కౌంటింగ్ కేంద్రాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., ఈరోజు సీపీ వెంట డీసీపీ శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, తదితర అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
ముందుగా సీపీ కూకట్ పల్లి లోని జెఎన్టీ యూహెచ్ విశ్వవిద్యాలయం లోని క్లాస్ రూమ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్, నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రిషి విమెన్స్ కాలేజ్ డీఆర్సీ సెంటర్, రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన డీఆర్సీ తదితర కౌంటింగ్ సెంటర్లను విజిట్ చేసి భద్రతపరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ లో మొత్తం 10 చోట్ల డీఆర్సీ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయ్యన్నారు. అన్ని చోట్లా కౌంటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.
సైబరాబాద్ లో దాదాపు 7000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు.
ఓట్ల లెక్కింపు ముగిసిన 48 గంటల వరకూ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు అనుమతి లేదన్నారు.పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతనే ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు.విజయోత్సవ ర్యాలీలలో బాణాసంచా కాల్చడం, డీజె సౌండ్స్ నిషేదం అన్నారు.నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కౌంటింగ్ జరుగుతున్న సమయంలో లేనిపోని రూమర్స్ ను క్రియేట్ చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతరులను రెచ్చగొట్టేలా అనుచిత పోస్టులు, మెసేజులు పెట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







