చివరి షెడ్యూల్లోకి ఎంటరైన 'టక్ జగదీష్'
- December 04, 2020
హైదరాబాద్:నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'టక్ జగదీష్' షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్లోకి ప్రవేశించింది.
నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన చివరి షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..
ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
కో-డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







