మొదట కోటి మంది హెల్త్ వర్కర్స్ కి కోవిడ్ 19 వ్యాక్సిన్

- December 04, 2020 , by Maagulf
మొదట కోటి మంది హెల్త్ వర్కర్స్ కి కోవిడ్ 19 వ్యాక్సిన్

న్యూ ఢిల్లీ:కోవిడ్-19 ని మొదట కోటిమంది హెల్త్ వర్కర్స్ కి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సిబ్బంది కూడా ఉంటారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అనంతరం దాదాపు రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోటిమంది హెల్త్ వర్కర్లలో డాక్టర్లు, నర్సులు, 2 కోట్లమంది ఫ్రంట్ లైన్ సిబ్బందిలో పోలీసులు, సాయుధ దళాలు, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉంటారని ఆయన చెప్పారు.

స్టోరేజీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం.. ప్రధాని మోదీ

భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్టోరేజీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ప్రధాని మోదీ అంతకు ముందు తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ ని  కోల్డ్ స్టోరేజీలో ఉంచడానికి గల ఏర్పాట్లను ఇప్పటినుంచే పరిశీలించి. దీనిపై దృష్టి పెట్టాలని ఆయన వివిధ రాష్ట్రాలను కోరారు. ఈ టీకామందును మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచాలని, ఇంత తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి సౌకర్యాలున్న నగరాలు తక్కువగా ఉన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. వ్యాక్సిన్ స్టాక్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసినట్టు ఆయన చెప్పారు.  టీకామందులు అందుబాటులోకి రావడానికి మరెంతో కాలం లేదని, మరికొన్ని వారాల్లో ఇవి ప్రజలను చేరుతాయని అన్నారు. దేశంలో ఎనిమిది వ్యాక్సిన్లు వివిధ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు మోదీ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com