తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
- December 05, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 596 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. అలాగే… శుక్రవారం వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1470కి చేరింది. తెలంగాణలో శుక్రవారం 921 మంది వ్యాాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,62,751కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 6465 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో డెత్ రేటు 0.53 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.34 శాతంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం 59,471 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 57,22,82కి చేరింది. 803 టెస్టుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. GHMC పరిధిలో కొత్తగా 102 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. నారాయణ పేటలో మాత్రం నిన్న ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







