గ్యాస్ ట్రబుల్ తగ్గటానికి అద్భుతమైన చిట్కాలు..

- December 05, 2020 , by Maagulf
గ్యాస్ ట్రబుల్ తగ్గటానికి అద్భుతమైన చిట్కాలు..

గ్యాస్.. దాదాపుగా ప్రతి ఒక్కరూ దీనితో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా అనిపించడం, త్రేన్పులు, మంటగా ఉండడం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. కొంచెం మసాలాకు సంబంధించిన పదార్థాలు తిన్నా, సమయానికి తినకపోయినా, పులుపు పదార్థాలు తిన్నా కూడా ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తుంటుంది. వీటన్నింటితో పాటు పని ఒత్తిడి కూడా మరో కారణంగా చెబుతుంటారు వైద్యులు. లేటుగా తినడం.. తిన్న వెంటనే పడుకోవడం.. ఉరుకుల పరుగుల జీవితం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్‌ రావడానికి మేజర్ కారణాలు. ఈ సమస్యతో బాధపడే వారు రోజు వారీ తినే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సమస్యను కొంత వరకు నివారించొచ్చు. బీన్స్, క్యాబేజీ, చక్కెర కలిపిన జ్యూస్‌లు, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటే మంచిది. ఎక్కువ బ్యాక్టీరియాను కూడా కలిగి ఉంటాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలై కడుపుని ఇబ్బందికి గురిచేస్తుంటాయి.

వంట గదిలోని ఆహార పదార్థాల ద్వారా కొంత వరకు గ్యాస్‌ని నివారించొచ్చు.

1. వాము: జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్టిక్ రసాలను వాము విడుదల చేస్తుంది అని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూద్ వివరించారు. ప్రతి రోజు గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము వేసి ఆ నీటిని వేడి చేసి చల్లారాక తాగాలి.

2. జీలకర్ర: ఇది లాలాజల గ్రంధులను ఉత్పత్తి చేస్తుంది. అధిక వాయువులు ఏర్పడకుండా చూస్తుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకుని గ్లాస్ నీటిలో వేసి మరగబెట్టాలి. అవి అర గ్లాస్ అయిన తరవాత దించి చల్లార్చి భోజనానంతరం తాగాలి.

3. ఇంగువ: అర టీస్పూన్ ఇంగువను గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా సమస్యను అరికట్టవచ్చని తెలుస్తోంది. ఆయుర్వేదం ప్రకారం ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

4.అల్లం: భోజనం చేసిన తరువాత ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం అపానవాయువు నుంచి ఉపశమనం కలిగించే ఏజెంటుగా పనిచేస్తుంది.

5. బేకింగ్ పౌడర్: అర టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ నిమ్మరసం ఒక కప్పు నీటిలో కలిపి తాగితే జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. భోజనం చేసిన తరువాత దీనిని తీసుకోవాలి.

6.త్రిఫల చూర్ణం: మూడు మూలికలతో తయారైన త్రిఫల చూర్ణం గ్యాస్ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. అర టీస్పూన్ త్రిఫల పొడిని గ్లాస్ వేడి నీటిలో కలిపి 10 నిమిషాలు అలానే ఉంచాలి. రాత్రి పడుకునేముందు తాగాలి. ఈ మిశ్రమంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే అర స్పూన్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అయితే సమస్య మరీ ఎక్కువగా ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com