కోవిడ్‌ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ

- December 05, 2020 , by Maagulf
కోవిడ్‌ నిబంధనల్ని పాటించని వలసదారులను దేశ బహిష్కరణ

మస్కట్:కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిర్దేశించబడిన నిబంధనల్ని ఉల్లంఘించారన్న కారణంగా 33 మంది వలస కార్మికుల్ని బహిష్కరించనున్నారు. అల్‌ బతినా, దోఫార్‌, ముసాందం మరియు అల్‌ షర్కియా సౌత్‌ గవర్నరేట్స్‌లో 42 మందిపై ఈ మేరకు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో 9 మంది ఒమనీయులు వున్నారు. ఎక్కువమంది గుమికూడటం, మాస్క్‌లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 3 వరకు నిందితులపై విచారణ జరిగింది, న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మూడు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా నిందితులకు విధించారు. విదేశీయుల్ని దేశం నుంచి పంపెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com