జో బిడెన్:అమెరికా పౌరులంతా తప్పనిసరిగా కోవిడ్ టీకా తీసుకోవాలన్న నిబంధనేమీ ఉండబోదు
- December 05, 2020
అమెరికా:అమెరికా పౌరులంతా తప్పనిసరిగా కోవిడ్ టీకా తీసుకోవాలన్న నిబంధనేమీ ఉండబోదని అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ ప్రకటించారు. తాను మాత్రం బహిరంగంగా అందరి ముందు టీకా తీసుకుంటానని తెలిపారు. అయితే.. మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే మాస్కు ధరించడం అత్యవసరమని.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. టీకా అందరికీ ఉచితంగా అందజేయడంతో పాటు తర్వాత ఎటువంటి సమస్యలు తలెత్తినా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, టీకా కూడా అందుబాటులోకి రానుండటంతో మరణాలు, కొత్త కేసులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనతో పాటు ముగ్గురు మాజీ అధ్యక్షులు బహిరంగంగా టీకా తీసుకోనున్నారని వెల్లడించారు. ఎవరిలోనైనా అనుమానాలుంటే తొలగిపోతాయని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన ప్రజలు, వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు 900 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ను బైడెన్ విజ్ఞప్తి చేశారు. ఇక.. తాను బాధ్యతలు స్వీకరించబోయే రోజు జనవరి 20న వేడుక వర్చువల్గా జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







