బ్యాంక్ ఖాతాదారులకు RBI శుభవార్త..
- December 05, 2020
ముంబై:రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఖాతాదారులకు ప్రయోజనం కలిగే నిర్ణయాన్ని ప్రకటించింది.RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలుగనుంది.
మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి నిబంధనలను సవరిస్తున్నట్లు RBI తెలిపింది. RTGS సేవలు ఇక ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం RTGS సేవలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. అయితే డిసెంబర్ 14 నుంచి ఈ సేవలు 365 రోజులూ అందుబాటులోనే ఉంటాయని చెప్పుకోవచ్చు.
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(RTGS) పేమెంట్ సిస్టమ్ డిసెంబర్ 14 నుంచి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.RBI గతంలోనే RTGS సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని బ్యాంకులను ఆదేశించింది. దీనికి డిసెంబర్ వరకు గడువ ఇచ్చింది.
దీంతో ఇప్పుడు RTGS సేవలు డిసెంబర్ 14 నుంచి 365 రోజులు అందుబాటులో ఉంటాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఆన్లైన్లోనే సులభంగానే డబ్బులు పంపొచ్చు.RTGS ద్వారా ఎప్పుడైనా ఇతరులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాగా RTGS, NEFT వంటి ట్రాన్సాక్షన్లకు ఎలాంటి చార్జీల పడవు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు పంపిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకోవాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు