భారత్ సహా పలు దేశాల ప్రయాణీకులకు ఎంట్రీ త్వరలో

- December 05, 2020 , by Maagulf
భారత్ సహా పలు దేశాల ప్రయాణీకులకు ఎంట్రీ త్వరలో

కువైట్ సిటీ:డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ), కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ (కెఐఎ) నుంచి విమానాల్ని నిర్వహిస్తోన్న సంస్థలకు సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. ఇండియా సహా ఫిలిప్పీన్స్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మరియు నేపాల్‌ల నుంచి వచ్చే ప్రయాణీకులకు సంబంధించి సర్క్యులర్‌లో పలు అంశాలు పొందుపరిచారు. కరోనా వైరస్‌ పరీక్షలకు సంబంధించి అనుమతి పొందిన లేబరేటరీస్‌ వివరాల్ని వీటిల్లో ప్రస్తావించారు. డిజిసిఎ పేర్కొన్న వివరాల ప్రకారం సంబంధిత లేబరేటరీల నుంచి ధృవీకరణ పొంది, కరోనా లేదని తేలిన ప్రయాణీకుల్ని మాత్రమే అనుమతిస్తారు. మెడికల్‌ యుటిలిటీనెట్‌ వర్క్‌ అక్రిడిటర్‌ సిస్టమ్‌ ద్వారా నమోదైన లేబరేటరీలకు చెందిన సర్టిఫికెట్లనే అనుమతించడం జరుగుతుందని డిజిసిఎ పేర్కొంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com