మహానటి సావిత్రి 85వ జయంతి సందర్భంగా మహానటి పాటలకు పట్టాభిషేకం
- December 05, 2020
వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, శారదా కళాసమితి ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 17 అంతర్జాతీయ తెలుగు సంస్థల అభినందనలతో డిసెంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు అంటే 12 గంటలపాటు నిర్విరామంగా 5 ఖండాలలోని 8 దేశాలలోని 30 మంది గాయనీ గాయకులు మహానటి సావిత్రి నటించిన చిత్రాలనుంచి ఆణిముత్యాలవంటి 100 పాటలతో ‘మహానటి పాటలకు పట్టాభిషేకం’ చేయనున్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించే ఈ కార్యక్రమం ప్రజానటి, కళాభారతి డా॥ జమునా రమణారావు, మండలి బుద్ధప్రసాద్ (పూర్వ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ), ఎమ్. మురళీమోహన్, సినీనటులు, నిర్మాత, పార్లమెంట్ పూర్వ సభ్యులు, రేలంగి నరసింహారావు, సినీ దర్శకులు, రోజారమణి, సినీనటి, కవిత సినీనటి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గాయనీగాయకులుగా లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు (గుంటూరు), చంద్రతేజ (హైదరాబాద్), కె. వెంకట్రావు (హైదరాబాద్), రాజేంద్రప్రసాద్ (వైజాగ్), చింతలపాటి సురేష్ (హైదరాబాద్), సురేఖామూర్తి దివాకర్ల (హైదరాబాద్), వి.కె. దుర్గ (హైదరాబాద్), వేదుల శశికళాస్వామి (హైదరాబాద్), బి.వి.ఎన్.ఎల్. పద్మావతి (హైదరాబాద్), అఖిల (హైదరాబాద్), చిత్తరువు లక్ష్మి పద్మజ (హైదరాబాద్), అనూరాధ (హైదరాబాద్), హిమబిందు (హైదరాబాద్), కె. భాగ్యలక్ష్మి (వైజాగ్), శ్రీనివాసు కిశోర్ భరద్వాజ (అమెరికా), కుమార్ రాణి (అమెరికా), రాధికానోరి (అమెరికా), లలితారాణి (అమెరికా), శాంతి ఇప్పనపల్లి (అమెరికా), శ్రీనివాసరావు నందగిరి (న్యూజిలాండ్), శ్రీసుత నాంపల్లి (న్యూజిలాండ్), రవి కంచిబొట్ల (ఆస్ట్రేలియా), నీరజ విష్ణుభొట్ల (ఆస్ట్రేలియా) ప్రియాంక మార్గాని (ఆస్ట్రేలియా), ఉష చివుకుల (ఆస్ట్రేలియా), రూపాశాస్త్రి (హాంకాంగ్), కీర్తిక మంగు (దక్షిణాఫ్రికా), విష్ణుప్రియ (స్వీడన్), రాధిక నడదూర్ (సింగపూర్) తమ గానాన్ని వినపించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు వ్యవస్థాపకులు, వంశీ సంస్థ, డా॥ తెన్నేటి సుధాదేవి, అధ్యక్షురాలు వంశీ, డా॥ వి.పి. కిల్లీ, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, డోగిపర్తి శంకరరావు, అధ్యక్షులు శారదా కళాసమితి, సురేఖామూర్తి దివాకర్ల, శైలజ సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ వంశీ, వ్యాఖ్యాన శిరోమణి సుధామయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు