రైతు సంఘాల ప్రతినిధులతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు..
- December 05, 2020
న్యూ ఢిల్లీ:వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం ఇది మూడోసారి. ఇప్పటికే మంగళ, గురువారాల్లో రెండు సార్లు కేంద్రమంత్రులు రైతులతో సమావేశమయ్యారు. నూతన చట్టాలపై వివరణ కూడా ఇచ్చారు. అయితే రైతులు వీటిని తిరస్కరించడంతో తాజాగా విజ్నాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన మరోమారు చర్చలు జరుగుతున్నాయి.
మూడు గంటలుగా జరుగుతున్న ఈ చర్చల్లో ఆసక్తికరమైన విషయాలు వెలువడుతున్నాయి. కనీస మద్దతు ధర హామీ సహా, కొత్త సాగు చట్టాల్లో పలు సవరణలు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సవరణలకు రైతు సంఘాలు ససేమిరా అంటున్నాయి. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. కనీస మద్దతు హామీతో మరో కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రధాన హామిగా చెబుతున్నాయి. రైతు కమిషన్లో కేవలం రైతులకు మాత్రమే స్థానం కల్పించాలని నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. పార్లమెంట్లో రైతు కమిషన్ ముసాయిదాతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగి సహేతుక డిమాండ్ల అమలుకు ఇబ్బంది లేదని చెబుతోంది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సిద్దమని తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్టర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. రైతు సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెబుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు