ఉసిరిలో దాగున్న ఔషధగుణాలు...
- December 06, 2020
భారతీయ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఆమ్లా (ఉసిరి) లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణకు, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, కళ్ళ సమస్యల నివారణకు, చర్మం నిగారింపు కోసం ఉసిరి అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 100 గ్రాముల తాజా ఆమ్లాలో 20 నారింజలలో ఉండే విటమిన్ సి ఉంటుంది. మరోవైపు, తేనె ఒక అద్భుతమైన దగ్గును అణిచివేసే ఔషధం.ఇది యాంటీవైరల్, యాంటీమైక్రోబయాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే, చిన్నపిల్లలకు ప్రతిరోజూ ఒక చెంచా తేనెను తినిపిస్తారు. ఇది చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. తేనె ఒక స్పూన్, ఆమ్లా రసం ఒక స్పూన్‌తో కలిపి ప్రతి ఉదయం తీసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.
ప్రతి రోజు ఆమ్ల జ్యూస్‌లో తేనె కలిపి రెండు సార్లు తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. ఇందులో ఉన్న అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్స్ వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ముఖం ఎల్లప్పుడూ తాజాగా మెరుస్తుంటుంది. బరువు నియంత్రణకు ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి తీసుకోవడం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చు. ఉసిరి జ్యూస్ రోజూ తాగితే మూత్రనాళ సమస్యలు, మూత్రాశయ మంటను తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష